TG Assembly: కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభం

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-31 11:42:45  IST  )

కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ ప్రారంభం అయింది.

TG Assembly: కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ ప్రారంభం అయింది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చర్చను ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని మొదలు పెట్టారు. కాళేశ్వరం కోసం రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. తీరా చూస్తే ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయింది. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా మారాయి. 20 నెలల నుంచి ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండటం చాలా బాధాకరమైన విషయం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చింది. ప్రాణహిత చేవెళ్లపై 2014 నాటికే రూ.11 వేల 600 కోట్లు ఖర్చు పెట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు అంచనా రూ.38 వేల 500 కోట్లు అయితే.. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేల కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ద్వారా ఐదేళ్లలో 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. అందులో 30 టీఎంసీలు మళ్లీ సముద్రంలోకి వదిలేశారు. లక్షకు పైగా కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టులో అతి తక్కువ కాలంలోనే ఆరు పిల్లర్లు కూలిపోవడం దారుణం అన్నారు.

Read More..

Big Debate: అసెంబ్లీలో భారీగా మోహరించిన మార్షల్స్.. ఏం జరుగబోతోంది?

Next Story