Big Debate: అసెంబ్లీలో భారీగా మోహరించిన మార్షల్స్.. ఏం జరుగబోతోంది?

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-31 11:37:51  IST  )

కాళేశ్వరం కమిషన్‌ నివేదిక(Kaleshwaram Commission Report)పై చర్చ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో భారీగా మార్షల్స్(Assembly Marshals) మోహరించారు.

Big Debate: అసెంబ్లీలో భారీగా మోహరించిన మార్షల్స్.. ఏం జరుగబోతోంది?
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్‌ నివేదిక(Kaleshwaram Commission Report)పై చర్చ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో భారీగా మార్షల్స్(Assembly Marshals) మోహరించారు. మరోవైపు కేరళ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ ప్రారంభం కానుంది. చర్చ నేపథ్యంలో ఇవాళ అర్థరాత్రి వరకు సభ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్చ అనంతరం ప్రభుత్వం ఏ విచారణకు ఆదేశిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కాళేశ్వరంపై ప్రజెంటేషన్‌కు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Read More..

TG Assembly: కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభం

Next Story