- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం’.. మంత్రి ఉత్తమ్ భావోద్వేగ ప్రకటన
పోచారం ప్రాజెక్టు(Pocharam project)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పోచారం ప్రాజెక్టు(Pocharam project)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చరిత్రలో ఎన్నడూ చూడని వరదను పోచారం డ్యామ్ తట్టుకున్నది. ఇది నిజంగా గర్వించదగ్గ భావోద్వేగ క్షణం. నా నీటిపారుదల శాఖ(Irrigation Department) సహచరులకు భారీ ఉపశమనం కలిగించింది. డ్యామ్ కెపాసిటీ 70 వేల క్యూసెక్కులు మాత్రమే.. అంతకుమించి వరద వచ్చినా ప్రాజెక్టు బలంగా నిలబడటం చాలా గొప్ప విషయం. నిన్న మొత్తం 1,82,000 క్యూసెక్కుల వచ్చింది’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు.
అత్యంత భారీ వర్షాలు కురిసిన్నప్పటికీ, పాలనా యంత్రాంగం సకాలంలో చేపట్టిన చర్యలతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని అన్నారు. ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోచారం జలాశయానికి నీటి ఇన్-ఫ్లో తగ్గినందున ఈ రిజర్వాయర్ ప్రమాదం నుండి బయట పడ్డట్టే అని నీటి పారుదల శాఖ అధికారులు తెలియచేసారు. వరద నీటిలో చిక్కుకున్న రూప్ సింగ్ తండా, వాడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలనుండి పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి తగు ఆహరం, మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలను అందించాలని అన్నారు.






