- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తునే తాకట్టు పెట్టారు: మంత్రి ఉత్తమ్ కౌంటర్
కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తునే తాకట్టు పెట్టారు: మంత్రి ఉత్తమ్ కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్(KCR) చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పందించారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 90 శాతం అబద్ధం అని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అని లక్షల కోట్లు పోసి కట్టారు.. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. లక్షల కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఒక్క రైతుకు లాభం జరుగలేదని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని సీరియస్ అయ్యారు. కేవలం కమీషన్ల కోసమే భారీ ప్రాజెక్టు కట్టారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా దేవాదుల ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అడిగారు. కేవలం రైతులు, ప్రాజెక్టులనే కాకుండా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరినీ కేసీఆర్ మోసం చేశారని అన్నారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్తోన్న మాకు కేసీఆర్ నీతులు చెప్పడం బాగోలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ నోటి వెంట నీతులు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని అన్నారు.






