- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రైబ్యునల్ ముందు నేనే స్వయంగా హాజరవుతా.. కృష్ణా జలాల వివాదంపై మంత్రి ఉత్తమ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) వెల్లడించారు. ఆదివారం రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, కృష్ణా (Krishna water dispute) జలాల వివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చలు జరిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో కృష్ణా జల వివాదంపై జరగబోయే విచారణ అంశాలపై మంత్రి అధికారులతో మాట్లాడారు. వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి పూర్తిగా సహకరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై విచారణకు స్వయంగా హాజరువుతానని చెప్పారు.
బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ (Brijesh Kumar Tribunal) ముందు స్వయంగా హాజరవుతానని తెలిపారు. వక్రీకృత నీటి కేటాయింపుల వల్ల తెలంగాణ రైతులు నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసమానతలను సరిదిద్దడానికి కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కాగా, ఏపీ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపిణీ పై వివాదం కొనసాగుతోంది. కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాల్లో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.






