- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక.. చర్యలపై సీఎం ప్రకటిస్తారు.. చిట్ చాట్‌లో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండో రోజు శాసనసభ సమావేశాలు (Assembly sessions) ప్రారంభం అయ్యాయి. (Kaleshwaram) కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారు. పెన్ డ్రైవ్‌లో 665 పేజీల పీసీ ఘోష్ నివేదిక ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఫ్లోర్ లీడర్లకే 650 ఫిజికల్ రిపోర్టును అందజేస్తామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అసెంబ్లీ లాబీలో మీడియా చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకొని చర్యల విషయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై మాట్లాడుతారని అన్నారు. ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం టేబుల్ చేసిందన్నారు. నాలుగు గంటలకు చర్చ ప్రారంభం అవుతుందని తెలిపారు. అందరికీ ఇప్పటికే కాపీలు అందజేస్తామని చెప్పారు. ఫ్లోర్ లీడర్లకు హార్డ్ కాపీలు ఇచ్చామని తెలిపారు. చర్యలకు సంబంధించి ప్రకటన సీఎం చేస్తారని స్పష్టం చేశారు. ఈ చర్చల తర్వాత 2 గంటల పాటు బ్రేక్ ఉంటుందన్నారు.






