- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తడిచిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
ధాన్యం కొనుగోళ్లపై ( Grain purchases) తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ధాన్యం కొనుగోళ్లపై ( Grain purchases) తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. అకాల వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలో ( Telangana ) పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయిన సంగతి తెలిసిందే. అయితే ఈ తడిచిన ధాన్యంపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)... చాలా ప్రాంతాలలో వర్షం తడిసిపోయిందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా పంట నష్టం జరిగితే... కొన్నిచోట్ల మోతాదులో పంటలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇక తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని కూడా కీలక ప్రకటన చేశారు. తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడైనా రైతులకు ( Farmers) ఇబ్బంది ఉంటే తమ వద్దకు సమాచారం అందించాలని కూడా వెల్లడించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ మంచి పథకమని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ( Bharatiya Janata Party) పాలిత రాష్ట్రాలలో ఎందుకు సన్నబియ్యం ఇవ్వడం లేదని నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చేవి దొడ్డు బియ్యం మాత్రమేనని... తెలంగాణ మాత్రమే సన్నబియ్యం ఇస్తుందని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).






