- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
ఈ ఏడాది యాసంగి పంట కాలానికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహన్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది యాసంగి పంట కాలానికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహన్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణ రావు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మంత్రులు మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మార్కెట్లలో రైతుల అంశాలపై ఆరా తీశారు. సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ తదితర తాజా అంశాలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహన్ సమగ్రంగా వివరించారు. గత ప్రభుత్వంలో ఇదే రోజు అంటే 2023 మే 15న యాసంగిలో మొత్తం ధాన్యం 25.35 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఈ సారి మాత్రం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడంపై మంత్రులు అధికారులను అభినందించారు.
ముందెన్నడూ లేని రీతిలోపెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలని ఆయన సూచించారు. రానున్న 10,12 రోజులు కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. నిజానిజాలు ప్రజలకు బహిర్గతం చేసి రైతులకు భరోసా కల్పించడంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు.






