- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‍కు ఏం తెలుసని మాట్లాడుతున్నారు?.. మంత్రి ఉత్తమ్ ఫైర్
by Prasad Jukanti |
వరి ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ చేస్తున్న విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ తెలిసీతెలియని మాటలు మాట్లాడుతున్నారని, కేటీఆర్ కు వరి ధాన్యం గురించి ఏం తెలుసు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంత దిగుబడి వస్తుంది.. ఎలా కొనాలనేది ఆయనకు తెలియదన్నారు. రాజకీయాలు చేయడం తప్పితే వారికి వాస్తవాలు తెలియదని దుయ్యబట్టారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మంత్రి.. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో ఉందన్నారు. తాము చేసింది చెప్పుకోలేక పోతున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో హమాలీల కొరతతో కొంత ఇబ్బంది పడ్డామని ఇప్పుడు సెట్ అయిందన్నారు. ఇప్పటి వరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని ఇందుకోసం సుమారు రూ. 9 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. మిగిలిన 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందని దీన్ని వారం రోజుల్లో సేకరించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు.
Next Story






