BRS చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదు.. హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ ఫైర్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

BRS చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదు.. హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి తెలంగాణలో పండిందని అన్నారు. రబీలో 56 లక్షల ఎకరాల పైగానే సాగు జరుగుతుందని చెప్పారు. రబీ యాక్షన్ ప్లాన్(Rabi Action Plan) ఇప్పటికే ప్రకటన చేశాం.. ముందు ఇచ్చిన సమాచారం ప్రకారమే నీళ్లు ఇస్తున్నామని అన్నారు. తక్కువ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో బీఆర్ఎస్ చేసిన పొరపాటు వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు.

ఏపీకి ధారాదత్తంగా నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) వదిలిపెట్టిందని చెప్పారు. కృష్ణానదీ జలాల్లో 512 టీఎంసీలు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రూల్స్ మార్చాలని ఒత్తిడి తెచ్చామని గుర్తుచేశారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకపోవడమే అత్యంత నష్టదాయకమన్నారు. గోదావరి బేసిన్‌(Godavari Basin)లో వాటర్ క్రైసిస్ అంతా బీఆర్ఎస్ పాపమే.. మేడిగడ్డ దగ్గర ప్రమాద రక్షణ చర్యలు చేపట్టకపోతే.. ఊళ్ళు కొట్టుకుపోతాయని NDSA రిపోర్ట్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇకనైనా తప్పుడు ఆరోపణలు చేయడం హరీష్ రావు మానుకోవాలని హితవు పలికారు.

Next Story