MLC ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. మంత్రి ఉత్తమ్ అత్యవసర సమావేశం

by Gantepaka Srikanth |

ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Elections)ల్లో ఓటమిపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధిష్టానం అలర్ట్ అయింది.

MLC ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. మంత్రి ఉత్తమ్ అత్యవసర సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Elections)ల్లో ఓటమిపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధిష్టానం అలర్ట్ అయింది. ప్రస్తుతం కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఆ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఓటమికి సంబంధించిన కారణాలు, పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాలపై ప్రజల రియాక్షన్‌పై ఆరా తీశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడకుండా చూసుకోవాలని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. మెజార్టీ స్థానాలు గెలుచుకునేలా అందరూ ఉమ్మడిగా పనిచేయాలని ఆదేశించారు. పార్టీ అంతర్గత విషయాలు బయట ప్రస్తావించకూడదని.. ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు శ్రీధర్‌ బాబు(Sridhar Babu), పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud), జీవన్‌ రెడ్డి(Jeevan Reddy) హాజరయ్యారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక(Graduate MLC Election)లు జరిగాయి. ఇందులో రెండు బీజేపీ, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా.. కాంగ్రెస్‌(Congress)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ముఖ్యంగా పార్టీ పని తీరుపై వివరిస్తూ నివేదికను సమర్పించాలని టీపీసీసీ(TPCC)ని హైకమాండ్(Congress High Command) ఆదేశించింది. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై నివేదిక సమర్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డి జిల్లా నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

Next Story