- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: ఉద్యోగులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్.. సమీక్షలో కీలక వ్యాఖ్యలు
నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల (Banakacharla) లింక్ ప్రాజెక్టును ఆపడానికి తెలంగాణ ప్రభుత్వం చట్టపరమైన చర్యలతో ముందుకు సాగుతుందని రాష్టర్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. ఇవాళ జలసౌధలో ఉన్నత నీటిపారుదల అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బనకచర్ల ప్రాజెక్టు చట్టవిరుద్ధమైనదని, రాష్ట్ర ప్రయోజనాలకు హానికరం అని అన్నారు. ఈ ప్రాజెక్టును సవాల్ చేయడానికి, తెలంగాణ వాదన బలంగా వినిపించేందుకు చట్టపరమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. తెలంగాణ నీటిపారుదల పనుల కోసం ఆర్మీ టన్నెల్ నిపుణులను నియమించనున్నామని చెప్పారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈనెల 30న పీపీటీ:
ఈ ప్రాజెక్ట్ విషయంలో ఈ నెల 18వ తేదీనే అఖిలపక్ష పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) ఇవ్వగా మరోసారి పీపీటీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకుగోదావరి -బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ తాజాగా వెల్లడించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తాజా పరిణామాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులతో సంప్రదింపులు, చేస్తున్న పోరాటం వివరాలను ఈ పీపీటీలో వివరించనున్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్ట్ కు ఎలా అంకురార్పణ జరిగిందో స్పష్టమైన డాక్యుమెంట్ల ఆధారాలు చూపడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రస్తుత చర్య వెనుక ఉన్న రాజకీయ నేపథ్యాన్ని బహిర్గతం చేసేలా ఈ పీపీటీ ఉండనందని చెప్పారు.
ఉద్యోగుల ప్రమోషన్స్, ట్రాన్స్ ఫర్లపై కీలక వ్యాఖ్యలు:
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై ఎన్డీఎస్‌ఏ సిఫార్సుల అమల్లో ఆలస్యం తగదని కేంద్ర జలసంఘం మార్గదర్శకాల మేరకు మరమ్మతులు చేయాలని పనుల పురోగతి నివేదికలను వారానికోసారి అందించాలని అధికారులను ఆదేశించారు. సింగూర్ కెనాల్‌తో సహా ఇతర ప్రధాన పనుల స్థితిని కూడా ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలతో సహా అనేక ఏజెన్సీల నుండి ప్రతిపాదనలు కోరినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేందుకు అదనపు మానవశక్తి నియమించాలని లైడార్ సర్వే నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలపై తక్షణ చర్య తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పదోన్నతులు, బదిలీలను ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తామని మంత్రి అధికారులకు హామీ ఇచ్చారు.






