వర్షాకాలనికి ముందే పనులు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ ఆదేశం

by Gantepaka Srikanth |

ఆధునిక పరిజ్ఞానంతోనే పూడికతీత పనులు చేపడుతున్నామని.. మట్టితో పేరుకుపోయిన ప్రాజెక్టులలో రెండోదశ పనులకు సత్వరమే శ్రీకారం చుట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

వర్షాకాలనికి ముందే పనులు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆధునిక పరిజ్ఞానంతోనే పూడికతీత పనులు చేపడుతున్నామని.. మట్టితో పేరుకుపోయిన ప్రాజెక్టులలో రెండోదశ పనులకు సత్వరమే శ్రీకారం చుట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి ముందే పనులకు పూర్తిచేయాలని సూచించారు. శుక్రవారం సెక్రెటేరియట్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మట్టితో పూడిపోయిన ప్రాజెక్టులలో నీటి సామర్థ్యం పూర్తిగా పడిపోవడంతో జాతీయ స్థాయిలో ఇది ప్రధాన సమస్యగా పరిణమించిందని చెప్పారు. నీటి భద్రత కల్పించేందుకు కేంద్రం జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన పూడికతీత విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అంకురార్పణ చుట్టిందని పేర్కొన్నారు. చారిత్రాత్మక బాక్ర నంగల్ నుండి రాష్ట్రంలో సుప్రసిద్ధ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు మట్టితో పూడి పోయి నీటి సామర్థ్యం నిలువలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 120 టీఎంసీల సామర్థ్యం ఏకంగా 80 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదటిదశలో చేపట్టిన పూడికతీత పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయనన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద కడెం ప్రాజెక్టులో మొదటి దశలో చేపట్టిన పూడికతీత విజయవంతమైందన్నారు. ఇక్కడ పూర్తిగా అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో ఉండాల్సిన నీటి సామర్థ్యం నిల్వలు.. వర్షాల ఉధృతికి వచ్చి చేరే నీటితో ఏర్పడ్డ నీటి నిల్వలపై సమగ్రంగా అధ్యయనం జరిపి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రివర్గం ముందుంచి ఆమోదం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రెటరీ కే.శ్రీనివాస్, ఈఎన్సీ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story