- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam Kumar Reddy: వరి సేకరణకు నిబంధనలు సవరించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నులు వరి సేకరణకు కేంద్రం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల (rice procurement) వరి సేకరణకు కేంద్రం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) డిమాండ్ చేశారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అధిక సేకరణ లక్ష్యాలను అత్యవసరంగా సవరించాలని, డెలివరీ నిబంధనలను సడలించి, అదనపు నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాలని, తెలంగాణ చరిత్రలో కానీ దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ అత్యధికంగా ఉంటుందన్నారు. గత రికార్డు 67 లక్షల మెట్రిక్ టన్నులు కాగా అందులో 45–50 లక్షల మెట్రిక్‌టన్నులు సన్నవరి, 30-35 లక్షల మెట్రిక్‌టన్నుల దొడ్డు వరి ఉందన్నారు.
క్వింటాలుకు రూ.2,389 కనీస మద్దతు ధర నిర్ణయించిన తర్వాత 80 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు దాదాపు రూ. 20 వేల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. బోనస్ చెల్లింపులు, రవాణా ఖర్చులతో రూ. 24 వేల నుంచి రూ. 26 వేల కోట్ల మధ్య పెరుగుతుంది. దేశంలో ఎక్కడైనా ఒకే పంట వరి పంట కోసం ఖర్చు చేయాల్సిన అత్యధిక మొత్తం ఇదేనన్నారు. కేఎంఎస్2024-25 కోసం సీఎంఆర్డెలివరీ గడువును 12 నవంబర్ 2025 వరకు పొడిగిస్తూ, పార్బాయిల్డ్ రైస్‌గా మాత్రమే సరఫరాను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముడి బియ్యం మార్పిడికి ఖరీఫ్ వరి మరింత అనుకూలంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న స్టాక్‌లో, 7.80 లక్షల మెట్రిక్ టన్నులు ముడి బియ్యం మిల్లర్ల వద్ద ఉన్నాయి, అయితే 1.67 మెట్రిక్ టన్నుల వరి (1.13 లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యానికి సమానం) బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద ఉంది. లభ్యతను బట్టి ముడి, బాయిల్డ్ రైస్ రెండింటినీ డెలివరీ చేయడానికి అనుమతి ఇవ్వాలని, బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని రబీ సీజన్‌కు మార్చాలని కేంద్ర పౌరసరఫరాల కార్యదర్శి సంజవ్చొప్రాను కోరారు.






