- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావు లాగా మాకు ఆ అలవాట్లు లేవు: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
హరీష్ రావు లాగా మాకు ఆ అలవాట్లు లేవు: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఇరిగేషన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు బరితెగించి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సెక్రెటేరియట్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో పాలమూరు-రంగారెడ్డికి రూ.7వేల కోట్లు ఖర్చు చేశామని.. వాటి లెక్కలు చెప్తామని అన్నారు. తాము వచ్చాక రెండేళ్లలో ప్రాజెక్టు కోసం 67 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ జరిగిందని.. 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ వర్క్ జరిగిందన్నారు. 9 కిలోమీటర్ల ప్రెజర్‌మేన్స్ లెన్త్ చేశామని.. వారి హయాంలో ఒక్క పంపు ఇన్‌స్టాలేషన్ చేయగా. తాము మరో 11 పంపుల ఇన్‌స్టాలేషన్ చేశామని వెల్లడించారు. అనుమతుల మీదా అన్నీ అబద్ధాలు చెప్పారని.. హైడ్రాలజీ అనుమతి లేదని.. పర్యావరణ క్లియరెన్స్ లేదని అన్నారు. ఏం సాధించకున్నా ఎలా మాట్లాడుతున్నారో వారికే తెలియాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి పనులు 90 శాతం పనులు పూర్తి చేశామని కేసీఆర్ అంటున్నారని.. అసలు వారి హయాంలో జరిగిన పనులు 30 నుంచి 40 శాతం మాత్రమేనని వెల్లడించారు.
తమ హయాంలో తట్టెడు మట్టి తీయలేదని కేసీఆర్, హరీశ్ అంటున్నారని.. బీఆర్ఎస్ హయాంలో రూ.27వేల కోట్లు పెట్టి ఎన్ని ఎకరాలకు నీరిచ్చారని ప్రశ్నించారు. ఒక్క పంపు ఆన్ చేసి మళ్లీ బంద్ పెట్టారని తెలిపారు. అంతేకాకుండా వాళ్ల హయాంలోనే ఈ ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్‌కు డీపీఆర్ రూ.55,086 కోట్లుగా ఇచ్చారని చెప్పారు. అలాగే.. పూర్తిస్థాయిలో ఆయకట్టు కాలువల భూ సేకరణకు కూడా ప్రొవిజనల్ ఇవ్వలేదని.. వీటికి 3,150 కోట్లు అదనంగా పొందుపరిచారని.. ఇంకా 30 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉన్నదని స్పష్టం చేశారు. రూ.20 లక్షల ఎకరం చొప్పున తీసుకున్నా ఇంకా రూ.6వేల కోట్లు భూసేకరణకే కావాలని తెలిపారు.
కమీషన్ల అలవాటు మీది..
హరీశ్ రావు కమిషన్లు అంటున్నారని.. ఆ అలవాట్లు తమకు లేవని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అన్నింటా కమీషన్లు తీసుకున్నది బీఆర్ఎస్ నేతలని ఆరోపించారు. 45 టీఎంసీలకు ఒప్పుకున్నారనేది అవాస్తవమని.. హరీశ్ తెలివితో మాయమాటలు చెప్తున్నారని పేర్కొన్నారు. అసలు కేసీఆర్‌కు పాలమూరు కట్టాలని లేదని ఆరోపించారు. 2020లో సెంట్రల్‌కు పంపిన నీటి వాటాల పంపకాల్లో పాలమూరు, ఎస్ఎల్‌బీసీకి, డిండికి నీళ్లు అడుగలేదని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఇరిగేషన్ కోసం రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీరివ్వలేదని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కట్టిన ప్రాజెక్టలతోనే నీళ్లను పంపిణీ చేశారని తెలిపారు. అలాగే.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతో ఏపీ నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ స్కీమ్ పనులను నిలిపివేశామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో ఎస్ఎల్‌బీసీని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. అసెంబ్లీలో నిబంధనల ప్రకారం నడుస్తుందని తెలిపారు. పీపీటీకి అవకాశం ఇస్తే ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చామని చెప్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.






