హరీష్ రావు మీద కేసీఆర్‌కు నమ్మకం లేదు.. అందుకే తొలగించారు: మంత్రి ఉత్తమ్

by Gantepaka Srikanth |

ఇరిగేషన్ (సాగునీటి) రంగంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చేసిన విమర్శలపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఘాటుగా స్పందించారు.

హరీష్ రావు మీద కేసీఆర్‌కు నమ్మకం లేదు.. అందుకే తొలగించారు: మంత్రి ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరిగేషన్ (సాగునీటి) రంగంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చేసిన విమర్శలపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఘాటుగా స్పందించారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. సాగునీటి రంగంలో హరీష్ రావు పెద్ద నిష్ణాతుడైనట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు. "ఇరిగేషన్లో హరీష్ రావు అంత నిష్ణాతుడే అయితే, గత ప్రభుత్వంలో ఆయన మామ కేసీఆర్ ఆ శాఖ నుంచి ఎందుకు తొలగించారు? హరీష్ రావు పనితీరుపై కేసీఆర్‌కు ఏమాత్రం నమ్మకం లేకనే ఆయనను నీటి పారుదల శాఖ మంత్రి పదవి నుంచి రాత్రికి రాత్రే తీసేశారు" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సరైన సమయంలో పూర్తి సమాధానం చెప్తా..

కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా హరీష్ రావు ప్రెజెంటేషన్లు ఇస్తున్నారని మంత్రి మండిపడ్డారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు, చూపించిన గణాంకాలకు తామ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన చేసిన ప్రతి విమర్శకు, ఆరోపణకు తాము సరైన సమయంలో, తగిన ఆధారాలతో సహా పూర్తి సమాధానం చెప్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story