- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్-2026 పేరుతో సైబర్ మోసాలకు బిగ్ స్కెచ్
ఎస్ఐఆర్-2026 పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.

దిశ, సిటీక్రైమ్: ఎస్ఐఆర్-2026 పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఎన్నికల అధికారులమంటూ ఫోన్ చేసి, "మీ వివరాలు ఎస్ఐఆర్‌లో నమోదు చేయాలి... లేకపోతే మీ ఓటు తొలగిపోతుంది" అంటూ భయాందోళనకు గురిచేసి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు సేకరించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందన్నారు. ఓటరు నమోదు లేదా ధృవీకరణ పేరుతో ఎన్నికల అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలు అడగరని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. అలాంటి కాల్స్‌ను నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ లేదా బ్యాంకింగ్ వివరాలు ఎవరికీ వెల్లడించవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే ఫోన్ కట్ చేసి, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు. ప్రజలు నిర్లక్ష్యంగా పంచుకునే ఒక్క ఓటీపీతోనే సైబర్ నేరగాళ్లు వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.






