- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇళ్ల నిర్మాణం 14ఏళ్ల కల: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని రామస్వామి గుట్టు వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇళ్ల సముదాయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని రామస్వామి గుట్టు వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇళ్ల సముదాయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇళ్ల నిర్మాణం కల దాదాపు 14 ఏళ్లది అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టామని అన్నారు. ఏ మున్సిపాలిటీలో దొరకని 110 ఎకరాల స్థలాన్ని దేవాదాయ శాఖ నుండి అనుమతులు పొంది ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం స్థలాన్ని సేకరించామని అన్నారు. 2160 ఇళ్లకు భూమి రేటు కాకుండా ఒక్కొక్క ఇంటికి రూ.6 లక్షలు ఖర్చు చేసి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పూర్తిగా ఈ నిర్మాణ వ్యవస్థను నిర్లక్ష్యానికి గురి చేసి డంపింగ్ యార్డుగా మార్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ అర్హులైన నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు.






