ఏఈలకు ప్రమోషన్లు ఇచ్చిన ఘనత మాదే: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

by Ajay Maddhiboyina |

నీటిపారుదల రంగం ప్రతిష్ట పెంపొందించడంలో ఇంజినీర్లు ముఖ్య భూమిక పోషించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.

ఏఈలకు ప్రమోషన్లు ఇచ్చిన ఘనత మాదే: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీటిపారుదల రంగం ప్రతిష్ట పెంపొందించడంలో ఇంజినీర్లు ముఖ్య భూమిక పోషించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఏఈలకు పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. గురువారం సెక్రెటేరియట్‌లో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల క్యాలెండర్, డైరీని మంత్రి ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు నీటిపారుదల రంగాన్ని మరింత పట్టిష్టం చేయాలని పేర్కొన్నారు.

అన్ని అవాంతరాలను అధిగమించి ఏఈఈలకు పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్, కార్యదర్శి ఎల్.నాగరాజు, కోశాధికారి సంతోష్, యాదాద్రి బోనగిరి జిల్లా అధ్యక్షుడు మనోహర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మహేంద్రనాథ్, జాయింట్ సెక్రెటరీ సుష్మ, జయశ్రీ, అరుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే.. తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కె.సుధర్ రెడ్డి, అధ్యక్షుడు ఎన్.శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.ప్రకాశ్‌, కె.వెంకటనారాయణ, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story