- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టు కూడా వదలం : మంత్రి ఉత్తమ్
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టు కూడా వదలమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టు కూడా వదలమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నది జలాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వాళ్లు శాసనసభకు రాకపోవడం దురదృష్టకరం అన్నారు. ఈ విషయంలో వాళ్లేదో గొప్పగా చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కృష్ణా గోదావరి నది జలాల నుండి తెలంగాణకు రావాల్సిన నీటి విషయంలో ఒక్క టీఎంసీ కాదు కదా ఒక్క చుక్క నీటిని కూడా వదిలిపెట్టదని స్పష్టం చేశారు. చుక్క నీరు కూడా ఎవరికి పోదని తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నామని అన్నారు. కృష్ణా నది జలాల్లో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కొందరు రైతులు ఆదారపడి ఉన్నారని చెప్పారు. నీటి హక్కులు కాపాడటంలో గత ప్రభుత్వం కంటే తాము సమర్థవంతంగా పని చేశామన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది గత ప్రభుత్వమేనని ఆరోపించారు.






