- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2047కు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తామన్న నమ్మకం ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిన్నటికి 2ఏళ్లు పూర్తయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము రెండేళ్లలో ఏం చేశాం అనేది వారం రోజులు ప్రజల్లోకి తీసుకువెళ్లాం అని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిన్నటికి 2ఏళ్లు పూర్తయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము రెండేళ్లలో ఏం చేశాం అనేది వారం రోజులు ప్రజల్లోకి తీసుకువెళ్లాం అని చెప్పారు. ప్రజలు తమ పరిపాలన పట్ల సంతోషంగా ఉన్నారని అన్నారు. తన మంత్రిత్వశాఖ నుండి సన్నబియ్యం, రేషన్ కార్డులు ఇవ్వడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఇక 2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
ఒక విజనరీ అప్రోచ్ తో ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఓ రోడ్ మ్యాప్ తయారు చేసుకుందన్నారు. ఫార్మా, సాఫ్ట్ వేర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే తమ లక్ష్యం అని చెప్పారు. కార్పొరేట్ దిగ్గాజాలను సమ్మిట్ కు ఆహ్వానించి వారితో పెట్టుబడులు పెట్టించడమే తమ ఉద్దేశ్యం అని అన్నారు. రాష్ట్ర జీడీపీ పెంచే విధంగా తమ ప్రణాళిక ఉండాలని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజాలను ఆహ్వనించామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ పై సంతోషంగా ఉన్నామని అన్నారు.






