అక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ యాత్రలు చేయడం ఏమిటి?: బీజేపీపై ఉత్తమ్ ఆగ్రహం

by Prasad Jukanti |

తెలంగాణలో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లోనే నిధులు జమ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

అక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ యాత్రలు చేయడం ఏమిటి?: బీజేపీపై ఉత్తమ్ ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేశారో చెక్ చేసుకోని మాపై విమర్శలు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి పంట కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసి నిధులు ఇచ్చామన్నారు. ఇవాళ హైదరాబాద్‍లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి.. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించడం లేదని విమర్శించారు.కేంద్రం చెప్పిన MSP ధర పెట్టి ధాన్యం తీసుకోవాలి. కేంద్రం నిర్లక్ష్యంగా ఉండి.. ఇక్కడ యాత్రలు చేయడం ఏమిటి? అని బీజేపీని ప్రశ్నించారు.

ఏ రాష్ట్రంలో ఎంత కొన్నారో చెప్పండి:

బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ధాన్యం తెలంగాణ కొనుగోలు చేస్తోందని, మేము 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటున్నామన్నారు. ఈ ధాన్యం మొత్తం కేంద్రం కొనాల్సి ఉందన్నారు. 8,575 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రాష్ట్రంలో చివరి గింజవరకు ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. నిన్నటి వరకు 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత ధాన్యం కొన్నదో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. గత ఏడాది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంకంటే 5వేల కోట్లు ఎక్కువ ఖర్చు చేశామన్నారు.

Next Story