- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ధాన్యం సేకరణ 2026: లారీల కొరతపై మంత్రి ఉత్తమ్ యాక్షన్ ప్లాన్!
రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యం లేకుండా ఉండేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యం లేకుండా ఉండేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. లారీల కొరతను అధిగమించేందుకు ఆయన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. లారీల కొరత ఉన్న ప్రాంతాల్లో.. ధాన్యం తరలింపునకు ఇసుక, సిమెంట్ లారీలను వాడుకోవాలని సూచించారు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా మిల్లులకు ధాన్యాన్ని సకాలంలో చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తేమ పేరుతో రైతుల్ని మోసం చేస్తే.. ఎవరినైనా క్షమించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. మిల్లుల యాజమాన్యం లేదా.. మధ్యవర్తులెవరైనా క్వింటాలుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువ ఇచ్చి రైతుల్ని నష్టపరిస్తే ఆ రైస్ మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెడతామని స్పష్టం చేశారు. అవసరమైతే అక్రమాలకు పాల్పడేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత కోసం రెవెన్యూ, పోలీస్, పౌరసరఫరాల శాఖలతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయని, రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకే చెల్లింపులు చేస్తున్నామన్నారు. ఈ ఒక్క ఏడాదే.. వరి రైతులకు రికార్డుస్థాయిలో రూ.45,000 కోట్లు చెల్లించామని తెలిపారు. 48 గంటల నుంచి వారంరోజుల్లోగా రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ చెల్లింపులన్నీ పూర్తయ్యేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.






