- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనవరి 1వ తేదీన కృష్ణా, గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ పీపీటీ.. హాజరుకానున్న సీఎం
వచ్చే నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. ప్రగతిభవన్ వేదికగా నిర్వహించే ఈ పీపీటీలో రాష్ట్ర జలవిధానంపై ప్రభుత్వ వైఖరి, గత పాలనలో జరిగిన నిర్ణయాలు, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరుకానున్నారు. ప్రధానంగా అసెంబ్లీలో కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించే లక్ష్యంతో.. గత ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వివరించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. 2, 3వ తేదీల్లో గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే.. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వారికి ఒకరోజు ముందుగానే పీపీటీలో వివరించనున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమయంలో జలాల విషయంలో జరిగిన రాజీలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించేందుకు, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకే వాయిస్‌తో మాట్లాడేందుకు ఈ ప్రజెంటేషన్‌ను కీలకంగా భావిస్తున్నారు.
పీపీటీ ముఖ్య అంశాలు
- కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులు.
- ఆంధ్రప్రదేశ్‌తో కొనసాగుతున్న జల వివాదాల తాజా పరిస్థితి.
- బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ముందున్న కేసుల స్థితి.
- గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన నష్టం.
- ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.
- కొత్త ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములపై ప్రభుత్వ దృష్టి






