- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Uttam : జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఏర్పాట్ల పరిశీలించిన మంత్రి ఉత్తమ్
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్(Jan Pahad Dargah) సైదులు బాబా దర్గా ఉర్సు(Ursu)ఏర్పాట్లను పరిశీలించారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్(Jan Pahad Dargah) సైదులు బాబా దర్గా ఉర్సు(Ursu)ఏర్పాట్లను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తో కలసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సర్వమత సమ్మేళనానికి జానపహాడ్ దర్గా ప్రతీక అని, 400 ఏళ్ళ చరిత్రతో భక్తుల ఆదరణతో విరాజిల్లుతున్న దర్గాలో ఈ నెల 23,24,25 లలో జరుగనున్న ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అంతా సహకరించాలన్నారు.
దర్గా అభివృద్ధికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు 60 లక్షల నియోజకవర్గ అభివృద్ధి నిధులతో సందల్ ఖాన(గంధం సత్రం)నిర్మాణం, యాత్రికుల వసతి గృహాల నిర్మాణం, ఐదు వాటర్ ట్యాంకుల ఏర్పాటు, స్పాట్ హౌస్ సీసీ ఫ్లోరింగ్ తో కలిపి, మసీదు షెడ్ నిర్మాణంతో పాటు గెస్ట్ హౌస్, దర్గా లోపలి క్యూ లైన్ స్టాండ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాజగా దర్గా అభివృద్ధి కోసం కోటి 11 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
ఈ నిధులతో సందల్ ఖానా గంధం సత్రం దగ్గర డ్రైనేజీ, బాత్ రూమ్ లు, మసీదు దగ్గర షెడ్లు, దర్గా దగ్గర రెండు బోర్ మోటార్లు, దర్గా చుట్టూ,దర్గా ముందు సీసీ రోడ్లు, సందల్ ఖానా (గంధపు సత్రం) దగ్గర సీసీ ఫ్లోరింగ్, మసీదు దగ్గర సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీ నిర్మాణపు పనులు, సందల్ ఖానా బావి దగ్గర నుండి డ్రైనేజీ నిర్మాణపు పనులను చేపట్టడం జరిగిందన్నారు. జానపహాడ్ ప్రాశస్త్యం గుర్తించి 400 ఏళ్ల కిందట దివంగత శేషారెడ్డి ఉర్సు ఉత్సవాలను ప్రారంభిస్తే ఆ పరంపరను కొనసాగించడంతో పాటు దర్గా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఉర్సు ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతులు సమకూరుస్తున్నట్లుగా పేర్కొన్నారు.






