- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam Kumar Reddy: కేసీఆర్, హరీశ్‍రావు బరితెగించి మాట్లాడుతున్నారు.. ఉత్తమ్ సీరియస్
కేసీఆర్, హరీశ్ రావు తీస్మారఖాన్‍లు అంటూ మంత్రి ఉత్తం సీరియస్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మండిపడ్డారు. సిగ్గులేకుండా కేసీఆర్, హరీశ్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆంధ్ర వాళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. ఇవాళ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేసీఆర్ డిజైన్ చేసి, నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని మేడిగడ్డ గురించి మాట్లాడటం ఆపి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించినవేనన్నారు. కాళేశ్వరం నుంచి ఐదేళ్లలో 70 టీఎంసీ మాత్రమే నీళ్లను ఉపయోగించారన్నారు.
45 టీఎంసీ లేఖ కొత్తది కాదు:
కేసీఆర్, హరీష్ రావు బరితేగించి మాట్లాడుతున్నారని హరీశ్‍రావు (Harish Rao) అతి తెలివితేటలు వాడటం ప్రజలు గమనిస్తున్నారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. హరీశ్ రావు గోబెల్స్ అని పెట్టుకోవాలన్నారు. కృష్ణా జల్లాల విషయంలో 2014 నుంచి 2020 వరకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ సంతకాలు పెట్టారు. కాంట్రాక్టర్ల కోసం కమిషన్లకు కక్కుర్తి పడి ఆపేక్స్ లో తక్కువ వాటాకు ఒప్పుకున్నారని ఆరోపించారు. పాలమూరు, డిండి, SLBC కేసీఆర్ ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పులు తీర్చడానికి ఏడాదికి వేల 20వేల కోట్లు కడుతున్నామని కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. 45 టీఎంసీ లేఖ కొత్తది కాదు... గత BRS ఒప్పందాన్నే మేము లేఖను రాశామన్నారు. 90 టీఎంసీ లను గతంలో కేసీఆరే డివైడ్ చేసి 45 టీఎంసీలుగా చేశారు. పాలమూరుకు ఇప్పటికీ పూర్తిగా పర్యావరణం అనుమతులు రాలేదు. పదేళ్ళ పాటు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. 90శాతం పనులు పూర్తి అయితే... ఒక్క ఎకరాకు నీళ్లు ఎందుకు ఇయ్యలేదు? పాలమూరు మాత్రమే కాదు అన్ని ప్రాజెక్టులు తిరిగేందుకు మేము సిద్ధమేనన్నారు. 2020 KRMB మీటింగ్ లో 45 టీఎంసీ తెలంగాణ కు సరిపోతాయని కేసీఆర్ ఒప్పుకున్నందుకు ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్, హరీశ్ రావు తీస్మారఖాన్‍లు..
కేసీఆర్ మాట్లాడితే కాంట్రాక్టర్‍లు అంటున్నాడు. మొత్తం లెక్కలు తిస్తే అసలు విషయం తెలుస్తుంది. కేసీఆర్ (KCR) 34శాతం కావాలని అంటే మేము వచ్చాక 70శాతం వాటా కావాలని లేఖ రాశాం. కేసీఆర్, హరీశ్ రావు ద్రోహం, కుట్రతో ఏపీకి నీళ్లు అప్పగించారని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్‍రావు తీస్మారఖాన్‍లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‍లో ఏపీతో కుమ్మకై రోజుకు 3టీఎంసీ అప్పగించారని అబద్ధాలు మాట్లాడటానికి హరీశ్‍రావుకు నోరు ఎలా వస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించామన్నారు. నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి? పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు?నల్గొండ జిల్లాకు అన్యాయం చేసేందుకు కేసీఆర్ డిండికి అనుమతి ఇవ్వలేదని కోమటిరెడ్డి పై కోపంతో బ్రహ్మనవెల్లి ప్రాజెక్టుపై కుట్ర చేశారన్నారు.






