Minister Uttam: కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి తీరని అన్యాయం .. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

నదీ జలాల విషయంలో రాష్ట్ర హక్కలను కాపాడేందుకు సమర్ధవంతంగా పని చేస్తున్నామని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు.

Minister Uttam: కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి తీరని అన్యాయం .. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నదీ జలాల విషయంలో రాష్ట్ర హక్కలను కాపాడేందుకు సమర్ధవంతంగా పని చేస్తున్నామని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. ఇవాళ నల్లగొండ (Nalgonda) జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాల (Krishna Waters) పంపిణీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఉందన్నారు.

KWD2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (Brijesh Kumar Tribunal) ఎదుట సెక్షన్-3 (Section-3) ప్రకారం న్యాయపరమైన వాదనలు వినిపిస్తామని తెలిపారు. మళ్లీ 1,811 టీఎంసీల నీటి వినియోగాన్ని పున: పరిశీలించాలని రిక్వెస్ట్ చేస్తామని అన్నారు. ఇది వరకు నీటి పారుదల శాఖ మంత్రులుగా పని చేసిన కేసీఆర్ (KCR), హరీశ్ రావు (Harish Rao)‌లు తెలంగాణ (Telangana)కు 299 టీఎంసీలు, ఆంధ్రాకు 512 టీఎంసీలు కేటాయిస్తూ ట్రిబ్యూనల్ తీర్పు ఇచ్చినప్పుడు వాళ్లు ఒప్పుకున్నారని సంతకాలు పెట్టి వచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం తాము ఆ తీర్పును వ్యతిరేకిస్తూ.. తెలంగాణ రాష్ట్రానికి 811 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ప్రభుత్వం తరఫున న్యాయపరమైన వాదనలు వినిపిస్తున్నామని అన్నారు.

Next Story