- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uttam: కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు బూడిద పాలు చేశారు: ఉత్తమ్
by Prasad Jukanti |
ప్రభుత్వంపై ప్రతిపక్షం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శిచారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వంపై ప్రతిపక్షం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, నదీజలాల్లో తెలంగాణకు 70 శాతం వాటాపై వాదనలు వినిపించామన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర జల హక్కుల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. 20 నెలల్లో ట్రైబ్యునల్, కోర్టుల్లో చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) పేరుతో రూ. లక్షల కోట్లు బూడిద పాలు చేసిందని ధ్వజమెత్తారు. వానాకాలం 67 లక్షల ఎకరాల్లో 148.3 లక్షల టన్నుల ధాన్యం పండింది. గత పదేళ్లలో లేని విధంగా రాష్ట్రంలో వరి సాగైందన్నారు.
Next Story






