- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam: మీరు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు.. బీఆర్ఎస్‍కు మంత్రి ఉత్తమ్ కౌంటర్
ఇండస్ట్రీ, విద్యుత్ అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఇండస్ట్రీయల్ లాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్టప్) పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. పాలసీ అర్థం కాక ఈ ప్రచారం చేస్తున్నారో? కావాలని చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇది ఆకస్మికంగా తెచ్చిన పాలసీ కాదని హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ఓఆర్ఆర్ బయటకి పంపాలని డిమాండ్ పాతదేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ పాలసీపై చర్చ జరిగిందని చెప్పారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని అలాంటి పరిస్థితి హైదరాబాద్‍కు రాకూడదని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అన్నారు.
మీరు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు:
ఇండస్ట్రియల్ పాలసీ (Industry Policy) రూపకల్పనలో నేను భాగంగా ఉన్నానని కొత్త ఇండస్ట్రియల్ పాలసీతో రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రకంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇండస్ట్రీ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని చాలా పారదర్శమైన పాలసీ తీసుకువచ్చామన్నారు. పవర్ గ్రిడ్‍లో ల్యాండ్ స్కాం జరుగుతోందని బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ ఖండించారు. ఓ పెద్దమనిషి తాము వస్తే పాలసీ మారుస్తామని అంటున్నారు. మీరు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు పాలసీ మార్చబోయేది లేదని బీఆర్ఎస్‍కు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో 50 వేల కోట్లు కాదు 50 వేల రూపాయల కుంభకోణం కూడా జరగలేదన్నారు. 2014 విభజన చట్ట ప్రకారం ఎన్టీపీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో 4 వేల మెగా వాట్ల పవర్ పాంట్ ఏర్పాటు చేస్తామని చెబితే అవి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్దమనుషులు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇండియా బుల్ అనే కంపెనీ దగ్గర ఉపయోగంలో లేని ఎక్విప్మెంట్ కొన్నది ఎందుకు? భద్రాద్రి ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏముంది? అని నిలదీశారు. భద్రాద్రి ప్రాజెక్టు అనవసరంగా తెలంగాణ ప్రజలపై రుద్దిన ప్రాజెక్టు అన్నారు. నల్గొండ డీసీసీ నియామకంపై మంత్రి నిరాకరించారు. ఇది పార్టీ ఇంటర్నల్ విషయం అని బయట మాట్లాడనన్నారు.






