Uttam: హరీశ్‍రావు ఏదో లేఖ చూపించి దుష్ప్రచారం.. మంత్రి ఉత్తమ్ కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-12-31 08:29:57  IST  )

బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Uttam: హరీశ్‍రావు ఏదో లేఖ చూపించి దుష్ప్రచారం..  మంత్రి ఉత్తమ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలవరం-నల్లమలసాగర్ (Polavaram Nallamala Sagar)ప్రి ఫీజిబులిటీ రిపోర్ట్ కు సీడబ్ల్యూసీ ఆమోదించిందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రి ఫీజిబులిటీ రిపోర్ట్ కు సీడబ్ల్యూసీ ఇంకా ఆమోదించలేదన్నారు. హరీశ్‍రావు ఏదో లేఖ చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ నీటి హక్కులను కాపాడుతున్నామన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మంత్రి బనకచర్లను అడ్డుకునేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టింది కేసీఆరేనన్నారు. జగన్‍తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మీరు కాదా? రోజా ఇంటికి పోయి బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అని కేసీఆర్ మాట్లాడారని గోదావరి, కృష్ణానీళ్లు ఆంధ్ర వాడుకుంటే తప్పేంటని కేసీఆర్ మాట్లాడలేదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. పాలమూరుకు 45 టీఎంసీలకే ఒప్పుకున్నాం అన్నది అవాస్తవం అని సీడబ్ల్యూసీ అభ్యంతరాల కారణంగా మొదటి విడతలో 45 టీఎంసీలు అడిగామన్నారు. రెండో విడతలో 45 టీఎంసీలు ఇవ్వాలని లేఖ రాశామన్నారు. కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణ ముఖ చిత్రం మారుస్తామన్నారు.

హరీశ్ రావు ఏమన్నారు?:

నిన్న తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు జారీ అయ్యాయని తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండానే సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం... నీటి ప్రయోజనాలకు గండి పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనుమతులు వచ్చాయన్నారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని సూచించారు. తెలంగాణ జలదోపిడీకి ఆదిత్య నాథ్ దాస్ సూత్రధారి అని వెంటనే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. కత్తి ఆంధ్రా వాళ్ళదైతే పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి అని బనకచర్ల అనుమతులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. సీడబ్ల్యూసీ అనుమతుల రద్దు కోరుతూ ఢిల్లీలో ధర్నా చేద్దాం రావాలని ప్రభుత్వానికి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Next Story