Uttam: హరీశ్ ఆ అలవాటు మానుకో.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-10-11 12:19:58  IST  )

బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Uttam: హరీశ్ ఆ అలవాటు మానుకో.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బనకచర్ల ప్రాజెక్టుపై (Banakacharla Project) హరీశ్ రావు చెప్పేవన్నీ అబద్ధాలు, అసత్యాలేనని , ఇకనైనా బద్నాం చేసే అలవాటు హరీశ్‍రావు మానుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు. ఇవాళ హనుమకొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుందని స్వయంగా కేంద్రానికి నోటిమాటగా, లిఖితపూర్వకంగా చెప్పామన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి తాము వ్యతిరేకమన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా పార్టీలతో మాకు సంబంధం లేదని నీటి హక్కుల విషయంలో రాజీపడబోమన్నారు.

తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం:

కృష్ణా, గోదావరి నది జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రిగా నేను పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ వాదనలు చాలా సమర్థంగా కేంద్రం, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ముందు వినిపించామన్నారు. పదేళ్లపాటు కృష్ణానదిలో తెలంగాణకు 299 టీఎంసీలు 512 టీఎంసీలు ఇస్తున్నట్లు లిఖితపూర్వకంగా అప్పగించింది కేసీఆర్, హరీశ్ రావు కాదా అని ప్రశ్నించారు. దేశంలోనే ఎక్కువ వరిధాన్యం పండిస్తున్న రాష్టం మనదేనని కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్నా ఈ రికార్డు పంటసాగు నమోదైందన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడలేదన్నారు. నీటీ వాటాల్లో తెలంగాణకు మోసం జరిగిందంటే అది బీఆర్ఎస్ హయాలోనేనన్నారు.

Next Story