Minister Uttam: కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2025-01-22 08:02:48.0  )
Minister Uttam: కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు పథకాలు రైతు భరోసా (Raithu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Aathmiya Bharosa), కొత్త రేషన్ కార్డులు (New Ration Cards), ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)కు దరఖాస్తులను స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24 వరకు గ్రామ సభలు కొనసాగనన్నాయి.

ఈ క్రమంలోనే ప్రజా పాలన (Praja Paalana) దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు (Ration Card) తప్పక అందజేస్తామని ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. ఒకవేళ గ్రామ సభలు ముగిసిన.. అర్హత ఉందని తేలితే లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రక్రియ ముగియగానే రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed