వడ్డీ రేటు తగ్గించండి - ఆర్ఈసీ సీఎండీని కోరిన మంత్రి ఉత్తమ్

by velandi.Saikiran |   (  Updated:2025-07-30 16:59:09  IST  )

రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టుల కోసం ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రి

వడ్డీ రేటు తగ్గించండి - ఆర్ఈసీ సీఎండీని కోరిన మంత్రి ఉత్తమ్
X

వడ్డీ రేటు తగ్గించండి

- ఆర్ఈసీ సీఎండీని కోరిన మంత్రి ఉత్తమ్

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టుల కోసం ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్) నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ అధికంగా ఉందని.. తగ్గించాలని ఆర్ఈసీ సీఎండీ జితేంద్ర శ్రీవాస్తవను బుధవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా కోరారు. ఆర్ఈసీ నుంచి అధిక వడ్డీకి రూ.16,000 కోట్లు ప్రభుత్వం అప్పుగా తీసుకుందని పేర్కొన్నారు. వడ్డీ రేటును తగ్గించడంతోపాటు రుణ చెల్లింపు కాలపరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. తమ అభ్యర్థనను పరిశీలిస్తామని సీఎండీ చెప్పినట్లు మంత్రి తెలిపారు.

Next Story