సీఎం రేవంత్‌తో మంత్రి ఉత్తమ్‌, సీఎస్ రామకృష్ణ భేటీ..కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌పై చర్చ

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్త‌మ్, సీఎస్ రామ‌కృష్ణ భేటీ అయ్యారు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌ను సీఎంకు అందించారు. ప్ర‌స్తుతం నివేదిక‌లోని కీల‌క అంశాల‌పై చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది.

సీఎం రేవంత్‌తో మంత్రి ఉత్తమ్‌, సీఎస్ రామకృష్ణ భేటీ..కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌పై చర్చ
X

దిశ‌, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్త‌మ్, సీఎస్ రామ‌కృష్ణ భేటీ అయ్యారు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌ను సీఎంకు అందించారు. ప్ర‌స్తుతం నివేదిక‌లోని కీల‌క అంశాల‌పై చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. పీసీ ఘోష్ క‌మిష‌న్ త‌మ నిదేదిక‌ను నిన్న‌నే అధికారుల‌కు అంద‌జేసింది. నివేదిక అందిన త‌ర‌వాత ఉన్న‌తాధికారుల‌తో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మీక్షించారు. ఇక నేడు కొద్దిసేప‌టి క్రితం నివేదిక‌తో సీఎంను కలిసి ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యారు.

కాళేశ్వ‌రం క‌మిష‌న్, ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ పాటిల్ వ్య‌వ‌హ‌రించారు. ఇదిలా ఉంటే 2023లో కాళేశ్వ‌రం ప్రాజెక్టులో మేడిగ‌డ్డ కుంగిపోయిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లోనూ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో అధికార కాంగ్రెస్ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. గతేడాది మార్చిలో పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. పదిహేను నెలల పాటు కమిషన్ బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. 115 మందిని విచారించి నివేదికను తయారు చేసింది. దీంతో ఘోష్ నివేదికలో ఏం ఉంది అన్న‌దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Next Story