- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రైతు రుణమాఫీ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని ఏ ఒక్క రైతు అధైర్యపడవద్దని అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భఁగా మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. రైతన్నల ఆదరణతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని ఎన్ని కష్టాలు వచ్చినా రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అణలు చేస్తామన్నారు. రైతులకు అన్ని సబ్సీడీ పథకాలను మళ్లీ పునరుద్ధరించబోతున్నట్లు వెల్లడించారు. రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు కలిగిన వారు రెండు లక్షలకు పైన ఉన్న నగదును ఈ నెలలో చెల్లించాలని వారికి కూడా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని చెప్పారు. తెలంగాణలో ఒక కోటి 45 లక్షల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నామని చెప్పారు.