- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ సమ్మిట్ ఎఫెక్ట్: వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
గ్లోబల్ సమ్మిట్ ఎఫెక్ట్: వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని అత్యున్నత లక్ష్యంగా పెట్టుకున్న ప్రజా ప్రభుత్వం, బడ్జెట్‌లో సింహభాగాన్ని వ్యవసాయ రంగానికి కేటాయించి, రైతుల ఆర్థిక భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీని అమలు చేసిందన్నారు. రైతుభరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.12వేల పెట్టుబడి సహాయం అందించడం ద్వారా రైతు కుటుంబాలకు ధైర్యం, స్థిరత్వం, పెట్టుబడి సామర్థ్యం అందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వంనుంచి పరిమిత మద్దతు మాత్రమే లభించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి, రైతు పక్షపాత ప్రభుత్వమనే నమ్మకాన్ని మరింత బలపరిచిందన్నారు. డిసెంబర్ లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం “విజన్ డాక్యుమెంట్ 2047”ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో“తెలంగాణ వ్యవసాయం- 2047 అగ్రిచాప్టర్” రూపొందించేందుకు శనివారం సెక్రటేరియేట్ లో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్తు వ్యవసాయ అభివృద్ధికి పునాది వేయనుందని మంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణ వ్యవసాయం ఎలా ఉండాలి.. దానికోసం ఏ విధమైన వ్యూహాలు, విధానాలు, మౌలిక సదుపాయాలు అవసరమో, ఏ రంగాలు అత్యంత కీలకం అవుతాయో వంటి అంశాలన్నీ శాస్త్రీయంగా పరిశీలించి ఈ నివేదిక రూపొందించబడుతోందన్నారు.. ఈ నివేదిక తయారీలో రాష్ట్రానికి చెందిన వ్యవసాయ, హార్టికల్చర్, రీసెర్చ్, మార్కెటింగ్ సంస్థల ఉన్నతాధికారులు, నిపుణులు సక్రియంగా పాల్గొంటున్నారు. నివేదికపై మంత్రి పలు కీలక సూచనలు చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యంతో వ్యవసాయరంగం సరిసమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. రైతు కేంద్రీకృత ప్రణాళికలు, రైతు ఆదాయం పెంపు, ఉత్పాదకతలో నాణ్యతా ప్రాముఖ్యత, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలను ప్రధానంగా చేర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రైతులు పండించే ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, విలువ జోడించే అగ్రి–ప్రాసెసింగ్ వ్యవస్థలను విస్తృతంగా అభివృద్ధి చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి గ్లోబల్ సీడ్ హబ్‌గా తీర్చిదిద్దాలని, నాణ్యమైన విత్తన ఉత్పత్తులు, సర్టిఫికేషన్ వ్యవస్థలు, ఎగుమతి ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అలాగే హార్టికల్చర్ మెగా క్లస్టర్లు ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు ప్రత్యేక ట్రేడింగ్ వింగ్‌ల ఏర్పాటు, డిజిటల్ వాటర్ ఇంటెలిజెన్స్ డేటాబేస్‌లు, బయో–ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లు వంటి ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆయన వివరించారు. వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, వ్యవసాయ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, వ్యవసాయ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జానయ్య మరియు ఉద్యానవర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజిరెడ్డి పాల్గొన్నారు.






