- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: కర్ణాటక నుంచి యూరియా వచ్చేస్తోంది.. రైతులకు మంత్రి తుమ్మల గుడ్‌న్యూస్
యూరియా కొరతపై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసి తెలంగాణ రైతాంగం యూరియా కష్టాల పై దేశానికి తెలిసేలా చేసిన ఎంపీలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అభినందనలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: యూరియా కొరతపై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసి తెలంగాణ రైతాంగం యూరియా కష్టాల పై దేశానికి తెలిసేలా చేసిన ఎంపీలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యూరియా (Urea) పోరాటం ఫలించిందని తెలిపారు. రాష్ట్రానికి ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. (Karnataka) కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్ మెంట్ ప్రారంభం అయిందని మంత్రి రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ వారంలో మరో మూడు షిప్‌మెంట్‌ల ద్వారా యూరియా సరఫరాకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ రాజకీయ స్వార్థం కోసం చేసే కుట్రల పట్ల రైతాంగం ఆలోచన చేయాలని పేర్కొన్నారు. తెలంగాణకు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష కారణంగానే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపించారు. తెలంగాణ రైతాంగం శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగానికి ఎల్లప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తుమ్మల వెల్లడించారు.






