- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Tummala: భద్రాచలం ఆలయం వద్ద మోటార్లు ఆన్ చేయకపోవడంపై తుమ్మల ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో: ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా మరోసారి గోదావరి నదికి భారీగా వరద పెరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి భద్రాద్రి రామాలయం విస్టా కాంప్లెక్స్, అన్నదాన సత్రం ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. అయితే ఈ వరద నీటిని గోదావరిలోకి ఎత్తి పోయడానికి మోటార్లు ఏర్పాటు చేసినా వాటిని ఆన్ చేయకపోవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద చేరినా వెంటనే మోటర్లు ఎందుకు ఆన్ చేయలేందంటూ మండిపడ్డారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
భద్రాద్రిలో భయం భయం:
భారీ వర్షాల కారణంగా భద్రాచలం పుణ్యక్షేత్రంలోని రంగనాయకుని గుట్టపై ఉన్న కుసుమ హరనాధ్ బాబా ఆలయ మండపం ప్రమాదకరంగా మారింది. వర్షం కారణంగా నేల కిందిగి కుంగిపోవడంతో మండపం పక్కకు ఒరిగింది. దీంతో మండపం కింద ఉన్న బండరాళ్లు జారిపడి క్రింద ఉన్న ఇంటి గోడలను తాకాయి. మండపం పూర్తిగా కూలిపోయేలా ప్రమాదకరంగా మారడంతో ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఒక వేళ మండపం కూలిపోతే గుట్ట కింద ఉన్న 4-5 ఇండ్లు ధ్వంసం అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రమాదకరంగా మారిన మండపాన్ని వెంటనే కూల్చివేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ మార్గంలో ఎవరూ రాకపోకలు సాగించకుండా దక్షిణం వైపు ఉన్న రహదారిని మూసివేశారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా మండపాన్ని కూల్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్ లు ప్రయత్నాలు చేస్తున్నాయి