సీఎం రేవంత్​రెడ్డికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు

by Muthe.Rajitha |

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపట్టే పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశమైయ్యారు.

సీఎం రేవంత్​రెడ్డికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపట్టే పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశమైయ్యారు. సీతారామ ప్రాజెక్ట్ అంచనాల పెంపుకు అనుమతించి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేందుకు సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ తో సమావేశమైన ఆయన పార్టీ వ్యవహారాలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించారు.

Next Story