కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి తుమ్మల

by Muthe.Rajitha |

రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ధంసలాపురం నుంచి కలెక్టరేట్ వరకు ఇరు వైపులా సర్వీస్ రోడ్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం బేగంపేట ఎయిర్​పోర్టులో కలిసిన ఆయన జగ్గయ్యపేట టూ కొత్తగూడెం వయా వైరా నూతన జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా ఖమ్మం నుంచి కురవి, అమరావతి టూ నాగపూర్ జాతీయ రహదారి వరకు రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. తుమ్మల కోరిన అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story