- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ మార్కెట్‌లో పత్తి తడిచిన ఘటనపై విచారణకు మంత్రి తుమ్మల ఆదేశం
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిచిన ఘటనపై..

X
- రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని స్ధానిక అధికారులు నివేదిక
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిచిన ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు బుధవారం వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ భాయి సూచనలతో రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. విచారణలో 7329 బస్తాల పత్తిలో 59 బస్తాలు మాత్రమే తడిసినట్లు తేలింది. తడిసిన పత్తిని సిబ్బంది సహాయంతో ఆరబెట్టి అదే రోజున కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. విచారణ నివేదిక ప్రకారం రైతులకు ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదని వివరాలతో కూడిన రిపోర్టును మార్కెటింగ్‌శాఖ అధికారులు మంత్రి కి అందజేశారు.
Next Story






