ఆ నిబంధన ఎత్తి వేయండి.. సీసీఐ సీఎండీకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

రైతులకు కపాస్ కిసాన్ యాప్ అన్ని వేళలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రాత్రి 10 గంటల వరకే ఓపెన్‌గా ఉండడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

ఆ నిబంధన ఎత్తి వేయండి.. సీసీఐ సీఎండీకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు కపాస్ కిసాన్ యాప్ అన్ని వేళలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రాత్రి 10 గంటల వరకే ఓపెన్‌గా ఉండడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. యాప్‌ను 24 గంటలు ఉంచేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాకు సూచించారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఎల్​1, ఎల్ 2, ఎల్​3 మిల్లులను వెంటనే ప్రారంభించే విధంగా చూడాలని, 20 తేమశాతం ఉన్న పత్తి సీసీఐ కొనుగోలు చేయాలన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి నిబంధన ఎత్తివేసి పాత విధానంలో విక్రయించే అవకాశం కల్పించాలని కోరారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిందని, అవసరమైతే వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ కేంద్ర ప్రభుత్య అధికారులను కలిసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు.

యాచారం ప్రాంతంలో రైతులు పండించిన పంటల కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 లక్ష మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ నిల్వ ఉండగా, ఈ నెలలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, వచ్చే నెలలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు జరిగినట్లు తెలిపారు. యూరియా సరఫరా త్వరగా జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. యూరియా తయారీలో ఉపయోగించే ఏడీ బ్లూ మూలకం రోడ్లపై విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయని అమ్మకం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొంథా తుఫాన్‌తో జరిగిన పంటనష్టంపై సర్వే నివేదిక వివరాలు వెంటనే అందించాలని తెలిపారు. క్రాప్ బుకింగ్ యాప్ లో పంట నష్టం పోటోలు అప్ లోడ్ చేస్తున్నారని వ్యవసాయ శాఖ అదికారులు వెల్లడించారు.

Next Story