NTR శిష్యుడు అనేలా పేరు తెచ్చుకున్నా.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలుగు రాజకీయాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

NTR శిష్యుడు అనేలా పేరు తెచ్చుకున్నా.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాజకీయాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్(Sr. NTR) విగ్రహాన్ని మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు కలుషితం అయిపోయాయని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు కనుమరుగు అవుతున్నాయని తెలిపారు. ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో ఒంటి మరక పడకుండా రాణిస్తున్నానంటే దానికి దివంగత నేత ఎన్టీఆరే కారణమన్నారు. నా రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉందని చెప్పారు. 1983 నుంచి నేటి వరకు ఎన్టీఆర్ అడుగు జాడల్లోనే నడుస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ శిష్యుడు ఎవరు అంటే.. తుమ్మల అనేలా పేరు తెచ్చుకున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. రాముడి పాదాల వద్ద ఎన్టీఆర్ స్వయంగా కండువా కప్పి తనను పార్టీలోకి చేర్చుకున్నారని గుర్తుచేశారు. ఆయన నుంచే నిజాయితీ, నిబద్ధతతో రాజకీయాలు చేయడం నేర్చుకున్నానని వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా అభివృద్ధి కోసం అహర్నిషలు పనిచేస్తున్నానని అన్నారు.

కాగా, అంతకుముందు తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. అర్హులైన రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు వెల్లడించారు. భూమి ఉన్న రైతులతో పాటు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు కూడా ఎకరాకు సంవత్సరానికి రూ.12,000, ప్రతి సీజన్‌కు రూ.6,000 చొప్పున రెండు విడతలుగా అందజేస్తామని భరోసా ఇచ్చారు.

Next Story