- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో టాక్స్‌కాన్-2026.. టెక్స్‌టైల్ రంగంపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
తెలంగాణను దేశంలోనే కాక ప్రపంచ స్థాయిలో టెక్స్‌టైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణను దేశంలోనే కాక ప్రపంచ స్థాయిలో టెక్స్‌టైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. నగరంలో జరిగే టాక్స్‌కాన్–2026 ద్వారా దేశీయ-అంతర్జాతీయ టెక్స్‌టైల్ పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, నిపుణులు ఒకే వేదికపైకి రావడం ద్వారా తెలంగాణలో టెక్స్‌టైల్ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఐటీఐ భాగస్వామ్యంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం సచివాలయంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి విడుదల చేశారు. సమావేశంలో టెక్స్‌టైల్ రంగంలో సస్టైనబిలిటీ, సాంకేతికత, సరఫరా వ్యవస్థల అభివృద్ధి, గ్లోబల్ మార్కెట్ల అవకాశాలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. అదనంగా, ఏప్రిల్ 4న వరంగల్‌లోని పీఎం మిత్రా పార్కు పరిశ్రమల సందర్శన కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణను టెక్స్‌టైల్, అపారెల్, ఫుట్‌వేర్ తయారీకి అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.






