- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ సమ్మిట్‌లో భవిష్యత్ విజన్ కనిపించే ఏవీల రూపకల్పన: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుమారు 200 బిలియన్ డాలర్ల వద్ద ఉందని, వచ్చే రెండు దశాబ్దాల్లో తెలంగాణను 15 రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే మహా దృక్పథానికి ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. శుక్రవారం సచివాలయంలో గ్లోబల్ సమ్మిట్ లో ప్రదర్శించాల్సిన ఏవీల కంటెంట్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యవసాయరంగం అభివృద్ధి సామార్థ్యాలు, విదేశీ పెట్టుబడి అవకాశాలు, భవిష్యత్ విజన్ స్పష్టంగా ప్రతిబింబించేలా ఏవీలను రూపొందించాలని సూచించారు. వ్యవసాయ రంగమే రాష్ట్ర ఆర్థిక లక్ష్య సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని స్పష్టం చేశారు. గ్రామీణ జనాభాలో 66 శాతం మందికి ఉపాధి అందించే వ్యవసాయం రాష్ట్ర జీఎస్వీఏలో 17 శాతం వరకు వాటా కలిగి ఉందని, తెలంగాణ ఆర్థిక వృద్ధిలో వ్యవసాయ అభివృద్ధి కేంద్రబిందువుగా ఉంటుందని తెలిపారు.
రైతు ఆదాయం పెరగడం, ఉత్పాదకత పెరుగుదల, విలువ ఆధారిత వ్యవసాయం విస్తరణ, ఎగుమతుల పెంపు 3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలక అంశాలన్నారు. ఐఓటీ ఆధారిత సూక్ష్మ నీటిపారుదల, నేల ఆరోగ్య నిర్వహణ, అగ్రిటెక్ పరిశోధన, గ్లోబల్ సీడ్ లీడర్‌షిప్, హార్టికల్చర్ మెగా క్లస్టర్లు, ఆయిల్ పామ్ విస్తరణ, పామ్టూరిజం, ఎఫ్ఓపీలు ఫుడ్‌డెలివరీ కంపెనీలతో అనుసంధానం చేయాలన్నారు. పాల, మాంసం, మత్స్య రంగాల పెంపు, అధునాతన అగ్రి లాజిస్టిక్స్ వంటి కార్యక్రమాలు తెలంగాణ వ్యవసాయాన్ని గ్లోబల్ ప్రమాణాలకు తీసుకెళ్తాయని పేర్కొన్నారు. ఇవి రైతుల ఆదాయాలను గణనీయంగా పెంచడమే కాకుండా, వేల కోట్ల రూపాయల విలువైన అగ్రి ఎగుమతులకు మార్గం సుగమం చేయనున్నాయని తెలిపారు.
విజన్ 2047 డాక్యుమెంట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి ఒక దిశ నిర్దేశిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రైతు భరోసా, రుణమాఫీ, పంట నష్టపరిహారం, రైతు బీమా వంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు భవిష్యత్తు వృద్ధికి బలమైన పునాది వేసిందన్నారు. ఇక నుంచి సాంకేతికత-ఆధారిత, డేటా-ఆధారిత, మార్కెట్-ఆధారిత వ్యవసాయ మోడల్ ద్వారా రైతులను మరింత సాధికారులను చేయడం ప్రభుత్వం సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ విసి జానయ్య, హార్టికల్చర్ యూనివర్సిటీ విసి రాజిరెడ్డి, మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి, హకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.






