- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా పంపిణీపై ఆందోళన అవసరం లేదు : మంత్రి తుమ్మల
రబీ సీజన్‌కు అవసరమైనంత యూరియా రాష్ట్రంలో పూర్తిగా అందుబాటులో ఉంది. రైతులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రబీ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వివిధ రకాల ఎరువులు 20.10 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ, కేంద్ర నుండి అక్టోబర్ నెల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 5.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటికే 5.84 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు పేర్కొన్నారు. కేటాయించిన పరిమాణం కంటే 24 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అధికంగా జరిగిందని వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రైతులు 3.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారని, ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అంటే 47.68 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
రబీ సీజన్‌కు అందుబాటులో ఉంది..
రబీ సీజన్‌కు అవసరమైనంత యూరియా రాష్ట్రంలో పూర్తిగా అందుబాటులో ఉంది. రైతులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించిన మేరకు యూరియా సమయానుకూలంగా రాష్ట్రానికి చేరుతోందన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు విని, భయాందోళనకు గురై అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా, అవసరమైన మేరకు రైతులు వినియోగించుకోవాలని కోరారు. యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా పై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. జిల్లాల వారీగా యూరియా నిల్వల వివరాలను వ్యవసాయ శాఖ విడుదల చేసిందని, అన్ని జిల్లాల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎరువుల సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహిస్తోందని, రబీ సీజన్ మొత్తం యూరియా కొరత తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు, రైతులకు అవసరం ఉన్నంత మేరకు యూరియా సరఫరా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఉమ్మడి జిల్లాల వారీగా జేడీఏ, ఏడీఏ స్థాయి అధికారులు..
అదే విధంగా యూరియా పంపిణీ సక్రమంగా జరిగేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా జేడీఏ, ఏడీఏ స్థాయి అధికారులను అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి నియమించారు. వరంగల్జిల్లాకు విజయ్ కుమార్, నల్గొండ నర్సింహ్మ రావు, మెదక్ జిల్లాకు గీత, రంగారెడ్డికి ఆశా కుమారి, కరీంనగర్ జిల్లాకు సుచరిత, మహబూబ్‌నగర్‌కు ఎస్.బాలు, నిజామాబాద్‌జిల్లాకు శైలజా, ఖమ్మంకు చంద్రశేఖర్, ఆదిలాబాద్జిల్లాలకు కనక రాజుకు బాధ్యతలు అప్పగించారు.






