- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seed Distribution: రైతులకు శుభవార్త.. రేపటి నుంచే విత్తన పంపిణీ షురూ.. మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Good news for farmers) రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (State Formation Day) సందర్భంగా జూన్ 2 నుంచి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ(ఆదివారం) ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 పంటల విత్తనాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 11 వేల గ్రామాల్లో 40 వేల మందికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా పంపిణీలో రైతులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
వ్యవసాయ వర్సిటీ విత్తనాలు రైతులకు పంపిణీ
అలాగే రేపట్నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ విత్తనాలు రైతులకు పంపిణీ చేయనున్నారు. విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా గ్రామాల్లో నాణ్యమైన విత్తన పంపిణీ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ వర్షాకాలం నేపథ్యంలో వ్యవసాయ శాఖకు విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచేందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ లు సంయుక్తంగా ముందుకు వచ్చి ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు 89,302 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను ఆగ్రో రైతు సేవ కేంద్రాలలోనూ, అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారాను పంపిణీకి సిద్ధం చేశాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు 1,17,912 మంది రైతులు 56,262 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 33,040 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి.






