- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు పత్తి పంటను సీసీఐ కేంద్రాల వద్దే అమ్మకాలు చేయాలి : మంత్రి తుమ్మల కీలక సూచనలు
మద్దతు ధర పథకంలో సోయా చిక్కుడు, పెసర కొనుగోళ్లకు కేంద్రం అనుమతుల కోసం కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర అధికారులను వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మద్దతు ధర పథకంలో సోయా చిక్కుడు, పెసర కొనుగోళ్లకు కేంద్రం అనుమతుల కోసం కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర అధికారులను వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ఆదేశించారు. (Farmers) రైతులు దళారులు దగ్గర మోసపోకుండా (CCI centers) సీసీఐ వద్ద మాత్రమే పత్తి అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్కొంటూ పత్తిలో తేమ శాతం తగ్గించి సరైన గిట్టుబాటు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పత్తిలో తేమ శాతం పరీక్షించే పరికరాలు అందుబాటులో ఉంచాలని, మార్కెట్ యార్డులలో సరిపడా యంత్రాలు, పరికరాలు, సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. వర్షాల నేపథ్యంలో పత్తి సేకరణలో సీసీఐ నిబంధనలలో 8 నుంచి 12 శాతం తేమ శాతం సడలింపు చేయాలని కోరారు. కొనుగోళ్ళ నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసే యంత్ర పరికరాలకు ఒక ఇన్వెంటరీ మెయింటెన్ చేస్తూ, వాటిని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తూ, సీజన్‌లో రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాల మార్కెటింగ్ అధికారులకు సూచించారు. ఈ నామ్సర్వర్లో సమస్య మూలంగా కొన్ని జిల్లాల్లో రైతులు ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలన్నారు.
ఈఏడాది సీసీఐ ప్రవేశపెట్టిన మ్యాపింగ్ విధానంతో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను కోరారు. ఎల్1, ఎల్2 విధానంలో ఎక్కడైనా సమస్యలు వస్తే సీసీఐ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన నోడల్ అధికారులు నిరంతరం పంటల కొనుగోళ్లు పర్యవేక్షించాలి. ఇప్పటికే స్కీమ్ లో లేని మొక్కజొన్న పంటను కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా రూ. 2400 కోట్ల నిధులతో మద్దతు ధరకు ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. పక్క రాష్ట్రాల్లో మద్దతు ధర అమలు చేయకపోవడంతో, సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు తమ పంటను తెలంగాణ మార్కెట్లలో అమ్మడంతో స్థానిక రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇతర రాష్ట్రాలలో మన ప్రభుత్వం చేపట్టినట్లు మద్దతు ధరకు మొక్కజొన్న పంట సేకరణ, లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఆ పంట ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఆ విధంగా తీసుకువచ్చి అమ్మకాలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత సీజన్‌లో జరిగిన పొరపాట్లను ఈ సారి ఎక్కడ పునరావృతం కావద్దన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి , మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ భాయి పాల్గొన్నారు.






