- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలిరోజు 15,414 మందికి కొత్త రేషన్ కార్డులు.. రేషన్ పంపిణీ ఎప్పటినుంచో తెలుసా?
తెలంగాణ వ్యాప్తంగా మొదటిరోజు 15,414 మందికి కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) జారీ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా మొదటిరోజు 15,414 మందికి కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) జారీ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) ప్రకటించారు. కొత్త కార్డుల్లోని 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. తొలిరోజు మండలానికి ఒక గ్రామంలో కొత్త రేషన్ కార్డును జారీ చేసినట్లు వెల్లడించారు. పాత రేషన్ కార్డుల్లో అదనంగా 1,03,674 మంది పేర్లు చేర్చినట్లు చెప్పారు. అంతేకాదు.. 561 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించినట్లు తెలిపారు. మొదటిరోజు 18,180 మంది భూమిలేని రైతు కూలీలకు నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. 72,000మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు.
మరోవైపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసే ప్రక్రియ సైతం కొనసాగుతోందని మంత్రి తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు. 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు గాను రూ.530 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా(Rythu Bharosa) ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి నాలుగు కీలక పథకాలను ప్రారంభించిన సందర్భంగా.. ఖమ్మం జిల్లా.. రఘునాథపాలెం మండలం మల్లెపల్లిలో జరిగిన పథకాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై మాట్లాడారు. రైతు భరోసాలో ఎకరాకు రూ. 12 వేలు సాయం అందజేస్తున్నామని అన్నారు. అర్ధరాత్రి నుంచే రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు జమ చేశామని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామన్నామని చెప్పుకొచ్చారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు సాయం అందజేస్తామని తెలిపారు. లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మార్చి 31 నాటికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు , రేషన్ కార్డులు నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.






