- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Tummala: మహిళలకు భారీ శుభవార్త.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
తెలంగాణ మహిళల(Telangana Womens)కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) భారీ శుభవార్త చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మహిళల(Telangana Womens)కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) భారీ శుభవార్త చెప్పారు. గురువారం ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్ పార్కు(Mega Food Park)ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఫుడ్ పార్కు నిర్మాణం జరిగిందని అన్నారు. ఇందులో మహిళలకు అవకాశాలు కల్పిస్తామని కీలక హామీ ఇచ్చారు. అంతేకాదు.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సహాయం అందిస్తామని అన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) మాట్లాడారు.
రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఈ ఫుడ్ పార్కును నిర్వీర్యం చేసిందని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే సంకల్పంతో ఉన్నారని అన్నారు. ఇప్పటికే మెగా ఫుడ్ పార్కులో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి వచ్చిన 8 కంపెనీలకు సబ్సిడీతో పాటు బోనస్ అందిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.






